18px
#452Telugu Spiritual Song

Nee jaldaru vrukshapu needalalo

నీ జల్దరు వృక్షపు నీడలలో - నే నానంద భరితుడనైతిని

ప|| నీ జల్దరు వృక్షపు నీడలలో - నే నానంద భరితుడనైతిని బలురక్కసి వృక్షపు గాయములు - ప్రేమా హస్తములతో తాకు ప్రభు || నీ ||
1. నా హృదయపు వాకిలి తీయుమని - పలు దినములు మంచులో నిలిచితివి నీ శిరము వానకు తడిసినను - నను రక్షించుటకు వేచితివి || నీ ||
2. ఓ ప్రియుడా నా అతిసుందరుడా - ధవళ వర్ణుడా నా కతిప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి - నీ సొగసును నాకు నొసగితివి || నీ ||
3. నీ పరిమళ పుష్ప సుగంధములు - నా రోత హృదయమును నింపినవి ద్రాకక్షారస ధారలకన్న మరి - నీ ప్రేమే ఎంతో అతిమధురం || నీ ||
4. ఉన్నత శిఖరములుదాటుచును - ఇదిగో అతడ - చ్చు చున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని - నా ప్రియుని కొరకు కనిపెట్టెదను || నీ ||
5. నీ విందు శాలకు నడిపించి - రాజులు యాజకులతో జేర్చితివి జీవాహారము నా కందించి - పరమా గీతములను నేర్పితివి || నీ ||