18px
#453Telugu Spiritual Song

Yesu nangeekarinchiti daiva putruda naithini

యేసు నంగీకరించితి దైవపుత్రుడనైతిని - పరమానందము నిజమైన శాంతియు

1. యేసు నంగీకరించితి దైవపుత్రుడనైతిని - పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి
ప|| వందన మర్పింతు కృపనొందితి - తన రాజ్యమందున చేరితిని
2. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగే చేతికుంగరమును కాళ్లకు జోళ్లను - నూతన వస్ర్తమొసగె || వందన ||
3. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె నా ఋణపత్రము మేకులగొట్టి - నిర్ధోషినిగా తీర్చె || వందన ||
4. పాపపు శిక్ష తొగెన్ నే నూతన సృష్టినైతిని రాజుగజేసె యాజకునిగను - పాడెద హల్లెలూయ || వందన ||
5. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును ఆ దినమునకై ప్ర"తితోనేను - కనిపెట్టుచున్నాను || వందన ||