#454Telugu Spiritual Song
Saagilapadi mrokkedamu satyamutho
సాగిలపడి మ్రెంుక్కెదము సత్యముతో
ప|| సాగిలపడి మ్రెంుక్కెదము సత్యముతో
ఆత్మతో మన ప్రభు యేసుని - ఆ...ఆ..ఆ...
1. మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని మోసముల నుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ - ఆశతో మ్రెంుక్కెదము || సాగిల ||
2. అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు - అందరము మ్రెంుక్కెదము || సాగిల ||
3. ఆలయముకన్న శ్రేష్ఠుడు - నిజ ఆలయముగా తానే యుండెన్
ఆలయము మీరేయనెను - ఎల్లకాలము మ్రెంుక్కెదము || సాగిల ||
4. యోనాకంటే శ్రేష్ఠుడు - ప్రాణదానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్ - ఘనపరచి మ్రెంుక్కెదము || సాగిల ||
5. సొలొమోనుకన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రెంుక్కెదము || సాగిల ||
6. రాజుల కంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను జేసెను
రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రెంుక్కెదను || సాగిల ||
7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రెంుక్కెదము || సాగిల ||
