18px
#455Telugu Spiritual Song

Naa praana priyudaa yesu raja - Arpintunu naa hrudayaarpana

నా ప్రాణ ప్రియుడా యేసురాజా - అర్పింతును నా హృదయార్పణ

ప|| నా ప్రాణ ప్రియుడా యేసురాజా - అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను - హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
1. అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా - మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ || నా ||
2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదను నా ప్రభువా || నా ||
3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణరాజా || నా ||
4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును || నా ||
5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతుల తోడ - నీ ప్రేమను నే వివరింతును - విమోచకా || నా ||
6. వాగ్ధానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నాకిచ్చితివే పాడెదను ప్రహర్షింతును - హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ || నా ||