18px
#457Telugu Spiritual Song

Oh Yesu nee prema entho mahaneeyamu

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

ప|| ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది
1. అగమ్య ఆనందమే - హృదయము నిండెను - ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు - స్తుతికి యోగ్యములు || ఓ ||
2. సంకట సమయములో సాగలేకున్నాము - దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడనుందునంటివి || ఓ ||
3. మరణాంధకారంపు లోయ నే సంచరించిన - నిరంతరమేను నాదు కాపరియై కరమునిచ్చి నన్ను గాయుచు - నడుపు కరుణగల ప్రభువు || ఓ ||
4. కొదువ లెన్నియున్న భయపడను నేనెపుడు - పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచుచు - నాతో నుండు నేసు || ఓ ||
5. దేవుని గృహములో సదా స్తుతించెదను - సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు - హల్లెలూయ ఆమేన్ || ఓ ||