18px
#458Telugu Spiritual Song

Vandanamo vandana mesayyaa

వందనమో వందన మేసయ్యా - అందుకొనుము మా దేవా మాదు

ప|| వందనమో వందన మేసయ్యా - అందుకొనుము మా దేవా మాదు వందన మందుకొనుమయా || వందన ||
1. ధరకేతించి ధరియించితివా - నర రూపమును నరలోకములో మరణము నొంది మరిలేచిన - మా మారని మహిమరాజా నీకిదే వందన మందుకొనుమయా || వందన ||
2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన - నీ ప్రేమకు సాటియే లేదిలలోన || వందన ||
3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము దయతలచి దరిద్రుని పిలిచి దారిని జూపిన దాతా - దేవా హృదయార్పణ నర్పింతు ||
4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు అంధుడనేను నా డెందమున నుండి - నడిపించు క్రీస్తుండా స్తుతిపాత్రుండ స్తుతింతు ||
5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ నరులకై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా - రాజా నీకిదే నా స్తుతియాగం || 6పరము నుండి పరిశుద్ధులతో - పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము - తక్షణమిచ్చు క్షితినిన్ చేరి స్తుతింతు
7. స్తుతి స్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా - నీకిదే వందనమందుకొనుమయా ||