#459Telugu Spiritual Song
Paavanudaa maa Prabhuvaa –
పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు - నీ రక్షణకై స్తోత్రములు
ప|| పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు - నీ రక్షణకై స్తోత్రములు
1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను || పావనుడా ||
2. పాపపు కుష్ఠుతో పడిచెడిన - ఈ పాపిని కరుణించితివి
నా పాపపుడాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా || పావనుడా ||
3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా || పావనుడా ||
4. నీ క్రయ ధనమధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు
నాకందరికంటె ఘనుడా - ఓ కల్వరినాధా యేసు || పావనుడా ||
5. మహిమపరతును ప్రభుయేసు - మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను || పావనుడా ||
6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతలమధ్య
రకక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు || పావనుడా ||
