18px
#460Telugu Spiritual Song

Yesu nan preminchitivi - aashrayamu lenapudu

యేసు నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు

ప|| యేసు నన్ ప్రేమించితివి - ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే - నా పాపభారము తొగె
1. నే దూరమైతి నీకు - నశియించితి లోకమున నేను గ్రహించలేదు - నీ హృదయ ప్రేమను || యేసు ||
2. నే తలచలే దెప్పుడు - నా అంత మేమవునని నా పాపములచే నేను - నిన్ను విసిగించితిని || యేసు ||
3. నిన్ను నేగాంచగానే - నా జీవితము మారెను నేనెంతో గ్రుచ్చబడి - నిన్నంగీకరించితి || యేసు ||
4. రక్షణ దొరకె నాకు - రక్తముతో నన్ను కడిగి రయముగా నీ చెంతకు - రకక్షకా తెచ్చితివి || యేసు ||
5. పరిశుద్ధులలో చేర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చి పూర్ణాధికారము నిచ్చి - పరలోకము తెరచితివి || యేసు ||