18px
#461Telugu Spiritual Song

Prema nammakamugala paraloka thandri

ప్రేమ నమ్మకముగల పరలోకతండ్రి

ప|| ప్రేమ నమ్మకముగల పరలోకతండ్రి తన కుమారుని పంపెను రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను
1. త్యాగసహిత ప్రేమజూపి - నెరవేర్చె తన నిబంధనను మనలను తానే నిర్మించె గనుక - మనలను ప్రేమించెను || ప్రేమ ||
2. శాశ్వత ప్రేమ చూపించెను - సిలువపై ఋజువు గావించెను తన రక్తముతో పాపులనెల్ల - శుద్ధుల జేసెనుగా || ప్రేమ ||
3. తండ్రివలెనే ప్రేమజూపి - నీచులనెల్ల ప్రేమించెను ఎవరు పాపమునొప్పుకొందురో - వారిని క్షమించును || ప్రేమ ||
4. మా జీవితముల మార్చి వేసి - తన సంతతిలో చేర్చెనుగా తన మహాప్రేమ జూపించి మాకు - స్వాస్థ్యము దయచేసెను || ప్రేమ ||
5. ఆత్మ శరీర ప్రాణములన్ - అర్పించి ప్రభుని స్తుతింతము హల్లెలూయ స్తుతి మహిమ ఘనత - ఎల్లప్పుడు ప్రభుకే || ప్రేమ ||