#462Telugu Spiritual Song
Jeevapu daata naa hrudayamuloniki raa
జీవపుదాత నా హృదయములోనికి రా
ప|| జీవపుదాత నా హృదయములోనికి రా
నూతన వెలుగు నూతన యనుభవ మందరికి నిమ్ము
1. నూతన జన్మమును మా కొసగి - నూతనముగ మము చేయన్
నూతన ఆత్మ హృదయము నిమ్ము - నిను నే స్తుతియింపన్ || జీవ ||
2. నూతన వ్యక్తిగచేయుము ప్రభువా - లోకము చూచునట్లు
నూతన వస్ర్తాహారములిచ్చి - సుందరునిగ చేయుము || జీవ ||
3. నూతన వాక్కులను మాకొసగి - నూతన గీతము నేర్పు
నూతన రాగమును మా కొసగి - నిత్యము స్తుతి పొందుము || జీవ ||
4. నూతన శక్తిని అందరికొసగి - నూతన మార్గము జూపు
నీదు మహిమ కొరకై నాకు - నూతన నడకను నేర్పు || జీవ ||
5. నూతన పాత్రగను ననుజేసి - నీదు మహిమతో నింపు
నూతన ఆయుధముగ మముచేసి - శత్రువును ఓడించు || జీవ ||
