#463Telugu Spiritual Song
Nenu ghorapaapini cheri - veduchuntini kshaminchumu
నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
ప|| నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన
ఆది దోషము అంటియుండెనయ్య - దాని నిర్మూలించు నేసయ్య
2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే
పాపము తోడనే పుట్టితి నేసయ్యా - దాని పరిహరింపుము
3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున
సత్యములేక నేజచ్చిన వాడను - ననుజీవింపచేయు యేసయ్యా
4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని
ఆపద గుర్తించ లేక నే గడిపితిని - దాపు జేరితి ప్రాపునీయుము
5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను
పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా - వచ్చి నీ ప్రాపున జేరితి
6. లోకానంద యందమందున ఈకతో వీక్షింపనేగితి
దావీదువలె బెత్షెబా బారిలో నుంటి - దేవా విమోచించు యేసయ్యా
7. ఎన్నెన్నోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి
యోనావలె మీనాగర్భములో నుంటి - నన్ను నీ దరిజేర్చుమేసయ్యా
