#464Telugu Spiritual Song
Priya yesu nirminchitivipriyamaara - naa hrudayam
ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం
ప|| ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా - హృదయాంతరంగమున
1. నీ రక్త ప్రభావమున - నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ - ప్రతి పాపమును కడిగి || ప్రియ ||
2. .అజాగరూకుడనైతి - నిజాశ్రయము విడచి
కరుణారసముతో నాకై - నికపెట్టితివి తండ్రీ || ప్రియ ||
3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనె
చేరితి నీదు దారి - కోరి నడిపించుము || ప్రియ ||
4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా || ప్రియ ||
