#465Telugu Spiritual Song
Teruvabadi yunnadi krupadwaramu
తెరువబడియున్నది కృపద్వారము - త్వరపడి రమ్మని పిలిచె నేసు
ప|| తెరువబడియున్నది కృపద్వారము - త్వరపడి రమ్మని పిలిచె నేసు
1. ఎవరును నశియింప వలదని - ఓరిమి ప్రభువు వహియించును
మారుమనస్సును పొందు సమయమిదే - మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు || తెరు ||
2. ద్వారము తెరువబడియుండగ - దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు
దీనిని నీవు అంగీకరించిన - దేవుని దీవెనలు పొందెదవు || తెరు ||
3. రాత్రి గడిచిపోయి పగలాయెను - అతిక్రమములను వీడుమనె ప్రభు
నీతిసూర్యుండు ఉదయించును - భీతిని విడచి సిద్ధపడుము || తెరు ||
4. అర్థరాత్రి వేళ గొప్ప సందడాయెను - అదిగో పెండ్లికుమారుడు వచ్చెననియు
సిద్ధముగా నున్నవారే వెళ్లేదరుగా - ఆ ద్వారము మూయబడు త్వరపడుమా || తెరు ||
5. వెళ్లగోరియున్న సిద్ధపడవలెను - యేసు రక్తమందు శుద్ధికావలెను
ఘనముగ మీరు ప్రవేశింపవలెను - మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే || తెరు ||
