18px
#466Telugu Spiritual Song

Kristu chentaku rammu priyudaa-yesu chentaku rammu priyudaa

క్రీస్తుచెంతకు రమ్ము ప్రియుడా - యేసు చెంతకు రమ్ము ప్రియుడా

ప|| క్రీస్తుచెంతకు రమ్ము ప్రియుడా - యేసు చెంతకు రమ్ము ప్రియుడా జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్
1. ఆయనే జీవజలము నిత్యమైన తృప్తినిచ్చును - నీవు ఆ జలము త్రాగిన ఇంకెన్నడు దప్పిగొనవు - యుగయుగముల వరకు || క్రీస్తు ||
2. ఆయనే జీవాహారము నిత్యమైన తృప్తినిచ్చును - జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు - యుగయుగముల వరకు || క్రీస్తు ||
3. ఆయనే జీవమార్గము స్వర్గరాజ్యమును చేరను - ఆయన నంగీకరించిన తండ్రియొద్దకు చేరెదవు - యుగములు రాజ్యమేలను || క్రీస్తు ||
4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను - నీవందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగ నిత్య సుఖము లొందెదవు || క్రీస్తు ||
5. ఆయనే నిత్య సత్యము సర్వలోకమును రక్షింప - ఆయనను స్వీకరించిన నిత్యశిక్ష నుండి తప్పించున్ - సదా ఆయనతో నుందువు || క్రీస్తు ||