#467Telugu Spiritual Song
Krupakaalamulo-prabhuyesuni - angeekarinchumu-O priyudaa
కృపకాలములో ప్రభుయేసుని - అంగీకరించుము ఓ ప్రియుడా
ప|| కృపకాలములో ప్రభుయేసుని - అంగీకరించుము ఓ ప్రియుడా
1. సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన
మిత్రుడా నీ కేమి లాభముండును(2)
ఈలాటి జీవముతో యేసుని ప్రేమ స్వరము విని
తెరువు నీ హృదయము ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తిపొందు || కృప||
2. ధర్మకర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు - భక్తి వేషాలు ధరించికొన్న(2)
పరలోకము చేరవు - కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్ద
మహాప్రభుని చరణముల్ చేరి - అర్పించుకో నిన్నే || కృప||
3. ప్రభుయేసు క్రీస్తు నిత్యరక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో
పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో(2)
ప్రభు శరణము చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధిచేసుకో
పరలోక ఆశీర్వాదములు నిత్యజీవము పొందు || కృప||
4. క్రీస్తులో పూర్ణ నిత్యజీవం పరలోక ఆశీర్వాదములు - ఓ మరణమా నీ ముల్లెక్కడ(2)
క్రీస్తునందు విజయమే శిక్షదండన తొలగింపబడె
ప్రభుయేసు క్రీస్తునందే ప్రభు శక్తిచే - పాతాళ ద్వారం సదా ఓడింపబడె || కృప||
