18px
#468Telugu Spiritual Song

Theruvu nee hrudaya dwarambu nedeprabhu

తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు

ప|| తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేల (2) - వేచియున్నది తీర్పు నీ కొరకై పరమున కేగుట కాయత్తపడుము - తెరువు నీ హృదయంబును
1. జన్మంబుతోనే పాపివి నీవు - నీతిమంతుడే లేడు కామ, క్రోధ, లోభ, మోహ, పాపపు డాగులివియే || తెరువు ||
2. ధర్మకర్మల వస్ర్తంబు - నీవు కప్పుకొన్న దాగవు నీ పాపము కడిగి నీతిగా - తీర్చె ఔషధంబేమి లేదు || తెరువు ||
3. తెలియదు నీకు నీ మరణ దినము - నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకమే వినుము - విడిపించెడి వారెవ్వరు? || తెరువు ||
4. పాపమువలన నీ జీవితమును నష్టపరచుకొందువా? భరింపలేని నరకబాధ ఏడ్పెగా నీ ఫలితము || తెరువు ||
5. పాపపు శిక్ష నీదైయుండ - నిన్ను రక్షింపనెంచె సిలువ శ్రమలు భరించె - నేసు నీకై రక్తము కార్చెగా || తెరువు ||
6. ఒప్పుకొనుము నీ పాపములను - అపరాధినంచు వేడు తన రక్తమందు కడుగును - నిన్ను రక్షణ నొందెదవు || తెరువు ||