#469Telugu Spiritual Song
Yerushalemu gummamulaara - rajunu loniki raanimmu
యెరూషలేము గుమ్మములారా - రాజును లోనికి రానిమ్ము
ప|| యెరూషలేము గుమ్మములారా - రాజును లోనికి రానిమ్ము
చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము
1. విజయుడై వచ్చుచున్నాడు - శత్రు సాతానును ఓడించి
ఖర్జూర మట్టలు వస్ర్తములెందుకు - మీ హృదయములను పరువుడి || యెరూష ||
2. అభ్యంతరపరచకుము - పిల్లలు, వృద్ధులు, యౌవనులన్
ప్రభుని విజయమునందు వారిని - స్తుతిస్తోత్రములు పాడనిమ్ము || యెరూష ||
3. నీ దుష్ట క్రియలను బట్టి - ప్రభుని దయను త్రోసెదవా
పరమరాజును హృదయ మందిరమున - నేడే రానిమ్ము స్నేహితుడా || యెరూష ||
4. నిన్ను దర్శించుటకే ప్రభు - నీ చెంతకు వచ్చెనుగా
గాయపడిన హస్తమును చాచి - నీ మదిలో చోటిమ్మనెను || యెరూష ||
5. పశ్చాత్తాపము నొందుము నేడె - నీ పాపము లొప్పుకొనుము
జీవము రక్షణ శాంతి నొసగును - ఆయనే ప్రభువు శ్లాఘించుము || యెరూష ||
