18px
#470Telugu Spiritual Song

Choodumu eekshaname calvarini

చూడుము ఈ క్షణమే కల్వరిని - ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను

ప|| చూడుము ఈ క్షణమే కల్వరిని - ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు - సిలువలో ్రవేలాడు చున్నాడుగా
1. మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు || చూడుము ||
2. ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు చనిపోయినను నీవు లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున || చూడుము ||
3. మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీ యేసుని || చూడుము ||
4. సిలువపై చూడుము ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవు యేమిత్తువు అర్పించుకో నీదు జీవితము - ఆయన కొఱకై జీవించుము || చూడుము ||