#471Telugu Spiritual Song
Entha paapinainanu - yesu cherchukonunu
ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును
1. ఎంత పాపినైనను - యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను - అంతట జాటించుడి
ప|| హల్లెలూయ - హల్లెలూయ యెంత పాపినైనను
యేసు చేర్చుకొనున - టంచు ప్రకటించుడి
2. మెండుగా క్షమాపణన్ - పూర్ణ సమాధానము
నెంత పాపికైన దా - నిచ్చి చేర్చుకొనును || హల్లె ||
3. తన దివ్యసిల్వచే - దీసి పాపశాపమున్
నన్ పవిత్రపర్చును - నాకు హాయి నిచ్చెను || హల్లె ||
4. ఘోర పాపినైనను - నన్ను జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందుచేర్చును || హల్లె ||
