18px
#472Telugu Spiritual Song

Yesuni sweekarinchu - kristhesuni sweekarinchu

యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు

ప|| యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము - త్వరితము తానే ప్రవేశించును
1. కనికరమందైశ్వర్యుండు - నిను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపమునుండి - విడిపింప నిన్ను వెదకివచ్చె || యేసుని ||
2. మన్నించు సర్వ పాపములన్ - తానే మాన్పును సర్వరోగములన్ కృప కనికరముల మకుటము నీకు - ధరియింప జేసి ఘనపరచున్ || యేసుని ||
3. అంధులకు దృష్టి కలుగజేసె - అంగహీనులను లేపి నడువజేసెన్ పలు విధములగు వ్యాధిగ్రస్తులకు - స్వస్థత నిచ్చెను తక్షణమే || యేసుని ||
4. పాపపు భారము భరియించెన్ - నీ రోగములన్నిటి తొలగించన్ సహించెను కొరడా దెబ్బల బాధను - జయించెను అన్ని శోధనలన్ || యేసుని ||
5. కలువరి సిలువలో ్రవేలాడి - తన రక్తము చిందించె ధారలుగా చేతులతో తన కాళ్లలో చీలలు - ముండ్ల కిరీటము ధరియించె || యేసుని ||
6. జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడే నిను రక్షింప || యేసుని ||