#473Telugu Spiritual Song
Oh paapi sandhinchitivaanee - paapa vimochakuni
ఓ పాపి సంధించితివా నీ పాప విమోచకుని
ప|| ఓ పాపి సంధించితివా నీ పాప విమోచకుని
నీ పాపముల్ క్షమించి నీ ప్రాణమునకు శాంతినొసగున్
1. బంధింపబడె ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను
నిందను పొందెను - పొంద నీ వానందము || ఓ పాపి ||
2. క్రీస్తు యేసు - నీ కొఱకేడ్చె - గేత్సెమనే వనములో
వాత్సల్యముతో నిన్నానందింపచేయ || ఓ పాపి ||
3. రక్షకుడు తీర్చుకై నిలిచె - అక్షయ జీవమీయ శిక్షను బొందె
నిన్నానందింపజేయ || ఓ పాపి ||
4. ప్రభువైన యేసు తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్
అబు"ను శాంతి - తెరచిన హృదయమున్ || ఓ పాపి ||
5. జీవజలమిచ్చి ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు జీవితాంతము వరకు
దప్పిగొన వే మాత్రము || ఓ పాపి ||
6. రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును అణచివేసి
దక్షిణ హస్తముతో - కప్పును నిన్నెప్పుడు || ఓ పాపి ||
7. దేవుని స్వరము వినుడి నేడే - దైవపుత్రులలొదురు సేవించుడి క్రీస్తుని
జీవితములర్పించి || ఓ పాపి ||
