#474Telugu Spiritual Song
Idiye samayambu randi yesuni jerandi
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ప|| ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి
1. పాపులనందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి - విజయము నిచ్చెనుగా || ఇదియే ||
2. రాజులకు రాజైన యేసు రానైయున్నాడు
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే - మీరు తయ్యారవ్వండి || ఇదియే ||
3. బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే
సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతే
తలుపును తట్టి నను మీకు - తెరువడు సుమ్మండి || ఇదియే ||
4. వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు
ప్రభువా ప్రభువనుచు - యెలుగెత్తి పిలచినను
మిమ్మును ఎరుగనూ - మీరెవరో పొమ్మనును || ఇదియే ||
5. నమ్మినవారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా
నమ్మనివారికి నిత్య నరకము తప్పదుగా
నిర్లక్ష్యము చేయకను రండి - రక్షణ పొందండి || ఇదియే ||
6. సందియపడకండి మీరు సాకులు చెప్పకను
సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
మరణదినమును - మన మెరుగము సుమ్మండి || ఇదియే ||
7. జాలము చేయకను మీరుహేళన చేయకను
కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను
తరుణముండగానే - మీరు త్వరపడి రారండి || ఇదియే ||
