#475Telugu Spiritual Song
Adbhutha deevenalu prabhuvaa
అదద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి
ప|| అదద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారము - ప్రభువా మా పై జూపితివి
1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు
నీ కిష్టులముగా బ్రతికి - దీవెనలెన్నో పొందెదము || అద్భుత ||
2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - స్వరంబు క్రొత్త్తజేసె || అద్భుత ||
3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అపుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో || అద్భుత ||
4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది - దీవెనలెన్నో పొందెదము || అద్భుత ||
5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము || అద్భుత ||
6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము || అద్భుత ||
