18px
#476Telugu Spiritual Song

Devunike mahima

దేవునికే మహిమ (2) - యుగయుగములకు కలుగునుగాక

ప|| దేవునికే మహిమ (2) - యుగయుగములకు కలుగునుగాక (2) దేవునికే మహిమ (2)
1. దేనికి దేవుడు శిల్పియు, నిర్మాణకుడో - దానికి మనలను వారసుల జేసెను వందనములను చెల్లింతము || దేవునికే ||
2. నిలవరమైనది మనకిల లేదని - వల్లభుడు స్థిరపరచెను పరమందు చెల్లించి స్తుతులను పూజింతుము || దేవునికే ||
3. సీయోను పురమగు దేవుని నగరుకు - సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే స్తోత్రగీతములను పాడెదము || దేవునికే ||
4. పరదేశులుగా మనలను చేయక - ప్రభుని యింటికి వారసులుగ జేసె పాడి పొగడెదము మన ప్రభుని || దేవునికే ||
5. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన - ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను ముదమారగను ప్రణుతింతుము || దేవునికే ||