#477Telugu Spiritual Song
Aashcharya karuda vive - Yehovaa neeve dhanyudavu
ఆశ్చర్యకరుడ వీవే - యెహోవా నీవే ధన్యుడవు
ప|| ఆశ్చర్యకరుడ వీవే - యెహోవా నీవే ధన్యుడవు
1. నీ కృప నింగినంటెను - వచ్చినవారె దయ పొందెదరు
నీవే దయాళుడవు || యెహో ||
2. నీ విశ్వాస్యత గొప్పది - ఉన్నతమైనది అందరి యెడల
ఎన్నడు మారనిది || యెహో ||
3. నీ నీతి స్థిరమైనది - పరిశీలించెదవు యెల్ల ప్రజలను
సరిదిద్దువాడ వీవే || యెహో ||
4. అమూల్యము నీ కరుణ - వచ్చినవారికి ఆశ్రయమిచ్చి
రెక్కలతో కప్పెదవు || యెహో ||
5. నీ యింట తృప్తిగలదు - ఆనంద జలమును త్రాగనిచ్చెదవు
నీ ప్రజలందరికీ || యెహో ||
6. నీ ప్రకాశము నిలుచు - నిన్నెరిగియున్న వారిపై నిరతం
మెండైన కృపనిత్తువు || యెహో ||
