18px
#478Telugu Spiritual Song

Naa praanamaa naa sarvama – aayanaparishudda

నా ప్రాణమా నా సర్వమా - ఆయన పరిశుద్ధ నామమునకు

ప|| నా ప్రాణమా నా సర్వమా - ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా - మరువకు ఆయన మేలులను
1. క్షమించును నీ పాపములను - కుదుర్చును నీ రోగములను కీడు నుండి నీ ప్రాణమును రక్షించి - కరుణా కిరీటము దయచేయును || నా ||
2. పడమటికి తూర్పెంత దూరమో - పాపములన్నియు దూరపరచెను తండ్రి తన తనయులపై జాలిపడునట్లు - భక్తుల యెడల జాలిపడును || నా ||
3. నిన్ను మేలులతో తృప్తిపరచున్ - నీ యౌవనము నూతన పరచును బాధితులకు బహున్యాయము తీర్చు - యెహోవా యెంతో దయాళుడు || నా ||
4. మనము నిర్మింపబడిన రీతి - మంటివారమని ప్రభు యెరుగును గడ్డి పువ్వువలె నున్నది మన బ్రతుకు - గాలి వీచగ అది యెగిరిపోవున్ || నా ||
5. స్థిరపరచె తన సింహాసనము - సర్వలోకమును యేలుచుండె నీ యాజ్ఞలను పాలించెదము - నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా || నా ||