18px
#479Telugu Spiritual Song

Paapini nenu thappiti - bhuvilo, rakshinchedi vaarevaru

పాపిని నేను తప్పితి - భువిలో రక్షించెడి వారెవరు

ప|| పాపిని నేను తప్పితి - భువిలో రక్షించెడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని
1. ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి దౌరాద్భుగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను || పాపిని ||
2. జీవము నివ్వ వచ్చితిమి - చచ్చియుంటి నేను బంధింపబడితిని మరణ బంధముతో - విడిపించెడి వారెవరు || పాపిని ||
3. జన్మముతోనే అపవిత్రుడను - నా స్వభావమే పాపం క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని || పాపిని ||
4. స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్య కార్యములు ఆచారములతో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు || పాపిని ||
5. భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై || పాపిని ||
6. ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చు చున్నాను నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణ కర్త వీవే || పాపిని ||