18px
#480Telugu Spiritual Song

Maname Prabhuni paraloka gruhamu

మనమే ప్రభుని పరలోక గృహము - తానే వసించును దానియందు

ప|| మనమే ప్రభుని పరలోక గృహము - తానే వసించును దానియందు
1. ఎంత సుందరమో ప్రభుని గృహము - నలుదిక్కుల నుండి కూర్చెనుగా ఏక శరీరము రక్తబంధముచే - వేలాది భాషల నుండినను || మనమే ||
2. ఒక నూతన వ్యక్తిగా మము జేసె - పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరముగ నమర్చబడి - దేవుని గుడారముగా నైతిమి || మనమే ||
3. నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులనియు లేదు - యేసుప్రభువే సర్వముగా || మనమే ||
4. ప్రభుని గృహమున కలహము లేదు - ఈర్ష్యకపట భేదము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమయుండును - నేర్పుతో నడుపును మన ప్రభువే || మనమే ||
5. ప్రభుని గృహము యిద్ధరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె ప్రతివానికి వాని పని నియమించె - కావలి యుండుము మెలకువతో || మనమే ||
6. దృఢ విశ్వాసము మదినందుంచి - విజయులై యాత్రలో సాగెదము ఆదర్శులమై ఈ జగమందున - పూర్తిగ శత్రువు నోడింతుము || మనమే ||
7. ప్రియుని దినము సమీపించుచున్నది - చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాస యోగ్యులముగ జీవించి - ఓరిమితో వేచియుండెదము || మనమే ||