#481Telugu Spiritual Song
Yesu chavonde siluvapai - nee korake naa korake
యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ప|| యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే
1. నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు - తుడిచె ఆ ప్రశస్త రక్తమే || యేసు ||
2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో - క్రీస్తు యేసు రక్తములో || యేసు ||
3. పాపశిక్ష పొందతగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని || యేసు ||
