18px
#482Telugu Spiritual Song

Daivatanayaa kristhunadhundaa

దైవతనయా క్రీస్తునాధుండా - అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా

ప|| దైవతనయా క్రీస్తునాధుండా - అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా
1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా || దైవ ||
2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము కడిగి పావన పరచినావా దేవా - కడకు బూరతో రానైయున్నావా || దైవ ||
3. మరణము జయించినావా మరణముల్లు విరచినావా మహిమతోడ లేచినావా - దేవా మాదు చింతలు దీర్చినావా || దైవ ||
4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణికే ఏతెంచినావా - దేవా ధన్యులనుగా జేసినావా || దైవ ||
5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు అల్ప్ఛయు ఓమేగయు నీవేగా - యేసు ఆర్భటించుచు రానైయున్నావా || దైవ ||