#483Telugu Spiritual Song
Siluvalo baliyaina devuni
సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన
ప|| సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల విలువైన
నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు
1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే || సిలువ ||
2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా || సిలువ ||
3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా || సిలువ ||
4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి || సిలువ ||
5. వ్యసనాక్రింతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా || సిలువ ||
6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
మరణమై నా కొరకు - మరి తిరిగి లేచితివా || సిలువ ||
7. పరమున కెత్తబడిన - ప్రియ యేసు రాకడకై
పదిలముగా కనిపెట్టి - పాడెదను హల్లెలూయ || సిలువ ||
