18px
#484Telugu Spiritual Song

Nee rakhtame-nee rakhtamenan - shudheekarinchun

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్

ప|| నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము
1. నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్రపరచుము || నీ రక్త ||
2. నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నది || నీ రక్త ||
3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే పాపవిముక్తి జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ || నీ రక్త ||
4. పందివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను ప్రేమతో జేర్చుకొంటివి - ప్రభువా నీకే స్తోత్రము || నీ రక్త ||
5. నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే || నీ రక్త ||
6. స్తుతి మహిమ ఘనతయు - యుగయుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును || నీ రక్త ||