18px
#485Telugu Spiritual Song

Manakai yesu maraninche - mana Papamula Korakainitya

మనకై యేసు మరణించె - మన పాపముల కొరకై

ప|| మనకై యేసు మరణించె - మన పాపముల కొరకై నిత్యజీవము నిచ్చుటకే - సత్యుండు సజీవుడాయె
1. తృణీకరింపబడె - విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయె - వ్యసనముల భరించెను || మన ||
2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్ మన మెన్నిక చేయకయే - మన ముఖములద్రిప్పితిమి || మన ||
3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె || మన ||
4. గ్రొరెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్ అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును || మన ||
5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను తన నోరు తెరువలేదు - మనకై క్రయదనమీయన్ || మన ||
6. ఎదిరింపలేదెవరిన్ - లేదే కపటము నోట యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్ || మన ||
7. సిలువలో ్రవేలాడెన్ - సమాధిలో నుండెను సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ || మన ||