18px
#486Telugu Spiritual Song

Doota paata padudi-rakshakun sthutinchudi

దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి

1. దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను - బేత్లెహేమునందున భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబునందున - మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
2. ఊర్థ్వలోకమందున - గొల్వగాను శుద్ధులు అంత్యకాలమందున - కన్యగర్భమందున బుట్టినట్టి రకక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా? దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
3. రావె నీతి సూర్యుడా - రావె దేవపుత్రుడా నీదు రాకవల్లను - లోక సౌఖ్యమాయెను భూనివాసులు అందరు - మృత్యుభీతి గెల్తురు నిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గును దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి