18px
#490Telugu Spiritual Song

Dappi gonina vaanipai neetin kummarinchunu

దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును

ప|| దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే
1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే || దప్పి ||
2. మన సంతతిపై తన ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే తన ఆత్మతో వారిని నింపి - నిర్మించును సంఘముగా || దప్పి ||
3. నీటి కాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు || దప్పి ||
4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే పరలోకము నుండి స్వరమున్ - వినిపించెను మన దేవుడే || దప్పి ||
5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే || దప్పి ||
6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను || దప్పి ||
7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు || దప్పి ||