#491Telugu Spiritual Song
Yesuni nammedivaaru aayana uchita krupatho
యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
ప|| యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు
1. ఖర్జూరపు చెట్టువలె - మొవ్వ వేయుచుండెదరు
ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు || యేసుని ||
2. లెబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు
ప్రభుకృపజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు || యేసుని ||
3. యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు
సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు || యేసుని ||
4. దేవుని యావరణములో - వర్థిల్లుచు నుండెదరు
సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు || యేసుని ||
5. వారు ముసలితనంబున - చిగురుపెట్టి ఫలింతురు
ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు || యేసుని ||
6. నీటి కాలువ యోరను - నాటబడిన వారలై
మేటిసారము కలిగి - పచ్చగనుందురు వారు || యేసుని ||
7. హల్లెలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు
చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు || యేసుని ||
