18px
#492Telugu Spiritual Song

Siyonu paatalu – santoshamuga-Paaduchu siyonu velludamu

సీయోను పాటలు సంతోషముగ - పాడుచు సీయోను వెళ్లుదము

ప|| సీయోను పాటలు సంతోషముగ - పాడుచు సీయోను వెళ్లుదము
1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు - కొంతకాల మెన్నో శ్రమలు || సీయోను ||
2. ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిలుపుడి || సీయోను ||
3. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా - పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును - మారనితనదు మాటనమ్ము || సీయోను ||
4. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి || సీయోను ||
5. ఆనందమయ పరలోకంబు మనది - అక్కడ నుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలిసి - పాడెదము ప్రభుయేసుకుజై || సీయోను ||