#493Telugu Spiritual Song
Idigo nenoka nootana kriyanu - cheyuchunnaanu
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
ప|| ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
అ.ప. ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా
1. అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేను
ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింపజేసెదను || ఇదిగో ||
2. నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు
సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను || ఇదిగో ||
3. అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు
ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి || ఇదిగో ||
4. నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి
ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను || ఇదిగో ||
5. నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి
ముందున్న వాటికన్న - ఘనకార్యములన్ జేతున్ || ఇదిగో ||
6. మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి
చెక్కెదనా రాతి మీద - నొక క్రొత్త్త నామమును || ఇదిగో ||
7. పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్
కరుణాసంపన్నుడగు - మన ప్రభునకు హల్లెలూయ || ఇదిగో ||
