#494Telugu Spiritual Song
Swachanda siyonu vaasi - sarvaadhikaari- kasturi puraasi
స్వచ్ఛంద సీయోను వాసి - సర్వాధికారి కస్తూరి పూరాసి
ప|| స్వచ్ఛంద సీయోను వాసి - సర్వాధికారి కస్తూరి పూరాసి
అ.ప. వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి
అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే
1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతములజేతున్
నీ ప్రజలందరి యెదుట పరిశోధింపజాలని మహా
పనులెల్ల ప్రభువే లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు || స్వచ్ఛంద ||
2. సంగీత నాదములతోడ - సీయోనుపురము
సొంపుగను చేరితిమి - శాశ్వత సంతోషము మా
శిరములపై వెలసెన్ దుఃఖము నిట్టూర్పును
పోయెన్ - మిక్కిలి ఆనందము గల...్గన్ || స్వచ్ఛంద ||
3. నీలముల పునాదులు వేసి నీలాంజనములతో
మాణిక్య మణులతో సువర్ణ శునీయముల
సూర్యకాంతముతో ప్రశస్త - రత్నములతో
ప్రవిమలముగ నినుగట్టెదను || స్వచ్ఛంద ||
4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్ర్తమును నీదే - ఉల్లాసవస్ర్తంబు నీదే
విడుదలయు నీదే హితవత్సరము - విముక్తి ఆత్మాభిషేకము నీదే || స్వచ్ఛంద ||
5. జలములలో బడి దాటునప్పుడు - బలమైయుండెదను
నీతోడై యుండెదను నదులలో వెళ్లునప్పుడు నీపై
పారవు అగ్ని మధ్యను నడిచినను - జ్వాలలు నిను కాల్చగలేవు || స్వచ్ఛంద ||
6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప గడియలను విడగొట్టెదను
నేను అంధకార స్థలములలో - నున్నట్టి నిధులను రహస్యములో మరుగైన
ధనమును నీ కొసంగెదను || స్వచ్ఛంద ||
7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన కూర్చండినది మొదలు
నేను చంకబెట్టుకొన్న నాదు ప్రజలారా - ముదిమి వచ్చువరకు నిన్ను
ఎత్తుకొను వాడను నేనే || స్వచ్ఛంద ||
