18px
#495Telugu Spiritual Song

Yesu Prabhuni sankalpamulu maaravu

యేసుప్రభుని సంకల్పములు - మారవు ఎన్నటికి మహాప్రభావము

ప|| యేసుప్రభుని సంకల్పములు - మారవు ఎన్నటికి మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు
1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో - త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవ || యేసు ||
2. కొండపై చూపిన విధముననే మందిరమును - నిలిపె ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె || యేసు ||
3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే - సుందరముగ నొకగ మేఘము గుడారమును కమ్మె - మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ || యేసు ||
4. నావన్నియు నీవేగదా అమరుడవగు దేవా - నీవన్నియు నాకిచ్చితివి నీ కృపను బట్టి మహిమపరతును - ఎల్లప్పుడు ఇహపరములయందు || యేసు ||
5. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి - పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో - నిరతము మహిమ స్తుతి ఘనత చెల్లించెద మెపుడు || యేసు ||