18px
#496Telugu Spiritual Song

Jayasheeludavagu Oh maa Prabhuvaa

జయశీలుడవగు ఓ మా ప్రభువా - జయగీతముల్ పాడెదం

ప|| జయశీలుడవగు ఓ మా ప్రభువా - జయగీతముల్ పాడెదం
1. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి - రక్షించితివి కృతజ్ఞతచే హృదయము నిండె - స్తుతియింతుమో మా ప్రభు || జయ ||
2. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయెను ఉదయించె మాపై నీతిసూర్యుండు - ముదమార ప్రణుతింతుము || జయ ||
3. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి - భాగ్యంబును నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను - దయతోడ నొసగితివి || జయ ||
4. శత్రుని వురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి - భయభీతిలోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో || జయ ||
5. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను అని ప్రభూ నీవు పోరాడితివి మా పక్షమందు నీవే || జయ ||
6. క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మమ్ము ఊరేగించుచు మహిమనొందుచున్న దేవా స్తోత్రములు || జయ ||
7. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు కొంటివి నీవు - విడువడిన మమ్ము వివాహితగా జేసె హల్లెలూయా పాడెదము || జయ ||