#497Telugu Spiritual Song
Yehovaa maa prabhuva bhoomi
యెహోవా మా ప్రభువా భూమి
ప|| యెహోవా మా ప్రభువా భూమి
ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది
1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ - బాలుర స్తుతి స్తోత్రములతో
స్థాపించితివి నీకొక దుర్గము - నేదాగునట్లు ఆశ్రయ దుర్గము || యెహో ||
2. నీ చేతిపనియైన ఆకాశమును - చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ - మానవుండు ఏపాటివాడు || యెహో ||
3. నీకంటె మానవుని కొంచెముగా - తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును - వానికి ధరింపజేసితివి || యెహో ||
4. అడవి మృగములు ఆకాశ పక్షులు - సముద్ర మత్స్యములు పశువులు
వాని పాదముల క్రింద నుంచి - అధికారము వానికిచ్చితివి || యెహో ||
5. నీ నామము మా ప్రభువా యెహోవా - ఎంతో ఘనత ప్రభావము గలది
ఆ నామమును బట్టి మాకిచ్చితివి - నీ రూపమును మాకు హల్లెలూయ || యెహో ||
