18px
#498Telugu Spiritual Song

Yehova naa balama- Yadaaradha mainadi nee margam

యెహోవా నా బలమా - యథార్ధమైనది నీ మార్గం

ప|| యెహోవా నా బలమా - యథార్ధమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం || యెహోవా ||
1. నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - విడువక నను యెడబాయని దేవా || యెహోవా ||
2. మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను - అదిరెను ధరణి భయకంపముచే || యెహోవా ||
3. పౌరుషముగల ప్రభు కోపింపగా - పర్వతముల పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన యగ్ని - దహించివేసెను వైరుల నెల్లన్ || యెహోవా ||
4. మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని || యెహోవా ||
5. దయగల వారిపై దయజూపించును - కరిఠనుల యెడల వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాధికారి || యెహోవా ||
6. నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును జలరాసుల నుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు || యెహోవా ||
7. నా కాళ్లను లేడి కాళ్లగా జేసి - ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి - అక్షయముగ తన పక్షమున జేర్చిన || యెహోవా ||
8. యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ వీవు అన్యజనులలో ధన్యత జూపుచు - హల్లెలూయా స్తుతిగానము జేసెద || యెహోవా ||