18px
#499Telugu Spiritual Song

Neeve Yehovaa naa kaaparivi-Naakemi koduva-ledilalona

నీవే యెహోవా నా కాపరివి - నాకేమి కొదువ లేదిలలోన

ప|| నీవే యెహోవా నా కాపరివి - నాకేమి కొదువ లేదిలలోన
1. పచ్చికగలచోట్ల నన్నుజేర్చి - స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు సేదను దీర్చి - నన్ను నడుపుము నీతిమార్గమున || నీవే ||
2. గాఢాంధకార లోయలయందు - పడియుండి నేను సంచరించినను తోడైయుందువు నీ దుడ్డుక్రర - దండముతో నీ వాదరించెదవు || నీవే ||
3. శత్రువుల యెదుట నీవు నాకు - నిత్యమగు విందు సిద్ధపరచి నాతల నూనెతో నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది || నీవే ||
4. నిశ్చయముగా కృపా క్షేమములే - వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరమున - స్థిరముగా నే నివసించెదను || నీవే ||