18px
#501Telugu Spiritual Song

Yesu prabhoo kapari naaku – vaasigaa Stutinchedan –

యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్

ప|| యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్ యేసు గొర్రెపిల్లను - పోయెదను తన వెంట
1. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్ - స్వచ్ఛ జలముచెంత నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున - తనివిదీర్చును || యేసు ||
2. మరణలోయ ద్వారా సరిగా నడిపించును - అడవి భయములెల్ల ఎడబాపి రక్షించున్ హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును || యేసు ||
3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును - నా గిన్నె నిండించి పొర్లి పారజేసి కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను వడిగా ఆయన సాయమున జయమున వెళ్లేదను || యేసు ||