#502Telugu Spiritual Song
Mana devuni pattana mandaayana -parishudda Parvatha mandu
మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు
ప|| మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడైయున్నాడు
1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతము ఉన్నతమై
అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది || మన ||
2. దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్లిరి || మన ||
3. అచ్చట వారల వణకును ప్రసవించు స్ర"్త - వేదనపట్టెను తూర్పుగాలిని రేపి
తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు || మన ||
4. సైన్యములకధిపతి యెహోవా దేవుని - పట్టణమునందు మనము
వినినట్టి రీతిగా - జరుగుట - మనము చూచితిమి || మన ||
5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు
దేవా నీ ఆలయమందున నీ కృపను ధ్యానించితిమి || మన ||
6. దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత గొప్పదైయున్నది || మన ||
7. ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడైయున్నాడు
మనల నడిపించును - మరణపర్యంతము హల్లెలూయా - ఆమెన్ || మన ||
