18px
#503Telugu Spiritual Song

Calvariloni shrestudaa – karunaa bharitha Simhamaa

కల్వరిలోని శ్రేష్ఠుడా - కరుణా భరిత సింహమా

ప|| కల్వరిలోని శ్రేష్ఠుడా - కరుణా భరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా
1. స్తుతికి పాత్రుండగువాడా - దూతలతో వేంచేయువాడా సుదతి మరియపుత్రుడా - సిలువలోని మిత్రుడా || కల్వరి ||
2. పాపులకై వచ్చినవాడా - ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా || కల్వరి ||
3. దీవెనల నిచ్చుటకై - వసుధ కేతెంచినవాడా నీవే సుంకరులాప్తుడవు - సిలువలోని మిత్రుడా || కల్వరి ||
4. అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా || కల్వరి ||
5. నీళ్లను రసముగ మార్చితివి - నీళ్లమీద నడిచితివి మేళ్లనొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా || కల్వరి ||
6. రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా || కల్వరి ||
7. హల్లెలూయా కర్హుడా - యెల్లరుకొనియాడువాడా బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా || కల్వరి ||