#504Telugu Spiritual Song
Yesu parishudda namamunaku - Yeppudu adhika stotrame
యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే
ప|| యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే
1. ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి నామమిది
పరిశుద్ధులు స్తుతించు నామమిది (2) || యేసు ||
2. సైతానున్ పాతాళ - మును జయించిన వీరత్వముగల నామమిది
జయ మొందెదము ఈ నామమున (2) || యేసు ||
3. నశించు పాపుల రక్షించలోక - మునకేతెంచిన నామమిది
పరలోకమున జేర్చు నామమిది (2) || యేసు ||
4. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది
లోకమంతా ప్రకాశించె నామమిది (2) || యేసు ||
5. శోధన గాధల - కృషర్ణసమయాన - ఓదార్చి నడుపు నామమిది
ఆటంకము తీసివేయు నామమిది (2) || యేసు ||
