#505Telugu Spiritual Song
Yehovaanu gaanamu - chesedamu yekamugaa
యెహోవాను గానము చేసెదము యేకముగా
ప|| యెహోవాను గానము చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము - ఆయనే దేవుడు మనకు
1. యుద్ధశూరుడేహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా || యెహోవా ||
2. ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
ఎ్రర సముద్రములోన - ముంచివేసెనెహోవా || యెహోవా ||
3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నీపై లేచువారిని || యెహోవా ||
4. దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను || యెహోవా ||
5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడా
అద్భుతమైన పూజ్యుడా నీ - వంటి వాడెవడు || యెహోవా ||
6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడిచిరి || యెహోవా ||
