#506Telugu Spiritual Song
Jeevambu nitcchina devudaa-Ne paadeda neeku nirantarumu
జీవంబు నిచ్చిన దేవుడా - నే పాడెద నీకు నిరంతరము
ప|| జీవంబు నిచ్చిన దేవుడా - నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయా హల్లెలూయా - పావనుండా నీకు పలుమారు
నేనింకేమియ్యంగ పాత్రుండను - హల్లెలూయ - హల్లెలూయా
1. వెలుగిచ్చినావు వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరిపోసి కాపాడితివి
ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదన్
హితుడ నీకే ఈ స్తుతి గీతము - హల్లెలూయా, హల్లెలూయా || జీవంబు ||
2. కరుణ కిరీటమిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా, హల్లెలూయా అని పాడెదన్
హితుడ నీకే ఈ స్తుతిగీతము - హల్లెలూయా - హల్లెలూయా || జీవంబు ||
